తాళ్లూరు: మండలంలోని బొద్దికూరపాడు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికయినట్లు హెచ్ ఎం బ్రహ్మయ్య తెలిపారు. ప్రకాశం జిల్లా గెమ్స్ ఫేడరేషన్ ఆధ్వర్యంలో అండర్ -19, అండర్ -17 పోటీలు జరిగాయి. అందులో అండర్-19 బాలుర విభాగంలో జి అభినయ్ రెడ్డి, బాలికల విభాగంలో పి సిరి చందన, అండర్ -17 బాలుర విభాగంలో టి ఏసు రాజు, బాలికలలో పి తరణిలు ఎంపికయ్యారు. ఎంపికక శిక్షణ ఇచ్చిన పీడీ ఎస్ రవిప్రసాద్ రెడ్డిని, విద్యార్థులను హెచ్ఎం బ్రహ్మయ్య, ఉపాధ్యాయులు అభినందించారు. ఎంపికయిన క్రీడాకారులు అక్టోబర్ 9,10,10 తేదీలలో వెస్ట్ గోదావరి జిల్లా ఆకవీడులో రాష్ట్ర స్దాయిలో పోటీలలో పాల్గొంటారని పీడీ రవి ప్రసాద్ రెడ్డి వివరించారు .

Save or share this story as a newspaper-style Epaper Clip: