డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక సేవా సంఘం కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రకాశం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె అర్జున్ నాయక్.. దర్శి డిఎస్పి పి బాలమురళీకృష్ణ. లు…….

దర్శి పట్టణంలోని పొదిలి రోడ్లో జాన్ కాంప్లెక్స్ లో శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక సేవా సంఘం కార్యాలయాన్ని ప్రకాశం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె అర్జున్ నాయక్ , దర్శి డిఎస్పి పి బాలమురళీకృష్ణ లో సంయుక్తముగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దర్శి పట్టణంలో అంబేద్కర్ సామాజిక సేవ సంఘం కార్యాలయం ఏర్పాటు చేయటం అభినందనీయమని ప్రజా సమస్యలు ముఖ్యంగా బహుజనల సమస్యలపై దృష్టి పెట్టి వారికి మీ సంఘం ద్వారా చేయూతనివ్వాలని వారు సూచించారు. అనంతరం తూర్పు చౌటపాలెం రోడ్ లోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణములో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కురిచేడు రోడ్డు. అద్దంకి రోడ్డు. పొదిలి రోడ్డు పురవీధులలో జై భీమ్ సైన్యం ద్వారా ర్యాలీ నిర్వహించారు. జై భీమ్లా నినాదంతో దర్శి పట్టణం మారు మ్రోగింది. జై భీమ్ సైన్యం విన్యాసాలు దర్శి పట్టణ పుర ప్రజలను ఆకర్షించాయి . ఈ సందర్భంగా పట్టణంలోని మౌలానా విద్యా సంస్థల చైర్మన్ మాట్లాడుతూ రానున్న రోజులలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఏకమై ఒక తాట మీదికి రావాలన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక సేవా సంఘం ముఖ్య సలహాదారులు నేరెళ్ల జాన్ మాట్లాడుతూ యువత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాటలో నడవాలని అంబేద్కర్ సూచించిన విధంగా యువకులు ఉండాలని చదువు సమీకరించు పోరాడు అనే నినాదంతో ప్రతి ఒక్క యువకుడు ఉండాలని ఆయన తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక సేవా సంఘం అధ్యక్షులు కవలకుంట్ల గోవింద ప్రసాద్ మాట్లాడుతూ రానున్న రోజులలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సమస్యలపై పోరాడతామని సమస్యలు పరిష్కరించే వరకు బాధితులకు అండగా ఉంటామని గ్రామాల్లోని యువతకు చదువు పట్ల ఆకర్షించే కార్యక్రమాలు చేపడతామని ఉన్నత చదువులు చదువుతూ మధ్యలో ఆగిపోయినటువంటి విద్యార్థులకు మా యొక్క సంఘము ద్వారా చేయూతనందిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో బహుజనుల అంతా ఏకం చేసి బహుజనుల రాజ్యాధికార దిశగా ప్రయత్నాలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి రాచపూడి మోషే , కోశాధికారి ఇత్తడి జోషి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కే వి జి కీర్తి , సురేష్ బాబు , గొర్రెపాటి వేణు, బొల్లా వెంకట్రావు , ఎం నాగేశ్వరరావు , సీనియర్ న్యాయవాది బి చెన్నకేశవులు, బాంబ్సెట్ నాయకులు గూడూరు కమలాకర్, ఉపాధ్యాయురాలు వి నర్సమ్మ , ప్రముఖ సంఘ సేవకులు జీవి రత్నం నియోజకవర్గంలోని పలువురు దళిత నాయకులు జై భీమ్ యువకులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *