ఈ నెల 12న ఒంగోలులో తలపెట్టిన చలో కలెక్టరేట్‌కు అనుమతి లేదు: ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు

డి.ఎస్.పి. కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు చలో కలెక్టరేట్ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సింగరాయకొండ చైతన్య నవోదయ పాఠశాలలో తౌషిక్ అనే 11 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై పోలీసు శాఖ ప్రత్యేక దర్యాప్తు చేపట్టిందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన అంశాలు ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉన్నాయని పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ నెల 12వ తేదీన చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతులు కోరుతూ ఎమ్మార్పీఎస్ నాయకులు డీఎస్పీకి వినతిపత్రం సమర్పించారని తెలిపారు.

గత కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి, వాటికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకావాలని పిలుపునివ్వడం జరుగుతోంది.

డీఎస్పీ కి సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్న అంశాలకు, రౌండ్ టేబుల్ సమావేశాల్లో చెబుతున్న విషయాలకు మధ్య వ్యత్యాసాలు ఉన్నందున, శాంతిభద్రతల సమస్యలు తలెత్తడంతో పాటు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నందున, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా సభలు, సమావేశాలకు అనుమతులు రద్దు చేసినట్లు తెలిపారు. 163 BNSS సెక్షన్ (144 Cr.P.C సెక్షన్) అమల కొరకు ఆర్డిఓ గారికి అనుమతి కొరకు పంపించడం జరిగింది.

ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, ఈ నెల 12వ తేదీన నిర్వహించ తలపెట్టిన చలో ఒంగోలు కలెక్టరేట్ కార్యక్రమానికి అనుమతి లేదని స్పష్టం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రజలందరికీ పోలీసు శాఖ తరఫున విజ్ఞప్తి ఏమిటంటే, ఈ ధర్నాకు అనుమతులు లేనందున ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించి, ఈ ధర్నాలో పాల్గొనవద్దని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాము.

ఈ కేసుకు సంబంధించి గతంలో పలుమార్లు మీడియా సమావేశాలు నిర్వహించడంతో పాటు, కేసు వివరాలపై పలువురు పెద్దలతో మా డీఎస్పీ గారు, సిబ్బంది ఎప్పటికప్పుడు చర్చిస్తూ వివరించడం జరిగింది.

ఈ కేసుకు సంబంధించి ఎలాంటి గోప్యత పాటించడం లేదని, ప్రతి అంశాన్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కేసు హైకోర్టు పర్యవేక్షణలో ఉన్నందున, సంబంధిత నివేదికలు, వివరాలను వెల్లడించాలంటే హైకోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, అందువల్ల కొన్ని విషయాలను ప్రస్తుతం వెల్లడించలేమని తెలిపారు.

ఎమ్మార్పీఎస్ నాయకులు ఈ కేసుకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే ముందుగా జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ఎస్పీ ని లేదా డీఎస్పీ ని కలిసి అడిగితే, కేసు విచారణకు సంబంధించిన వివరాలను పూర్తిగా వివరిస్తామని తెలిపారు.

నిన్న కొన్ని వీడియోలను ప్రదర్శిస్తూ, కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగిందని తెలిపారు. మొదట బాలుడు బాగానే ఉన్నాడని, ఆ తర్వాత పరిస్థితి విషమించిందని చెబుతున్నారని, ఈ అంశాలకు సంబంధించి పోలీసు అధికారులను కలిసి అడిగితే, కేసు విచారణ ఎలా నిర్వహించారు, ఎలాంటి ఆధారాలు సేకరించారనే విషయాలను పూర్తిగా వివరించేవారమని తెలిపారు.

పోలీసుల విచారణలో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే, వాటిని పరిశీలించేందుకు హైకోర్టు పర్యవేక్షణ ఉన్న నేపథ్యంలో, కేసుకు సంబంధించిన అంశాలపై ప్రజలు పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాట్లాడాలని తెలిపారు.

ఈ నెల 12వ తేదీన ఒంగోలులోని జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించ తలపెట్టిన ధర్నాకు అనుమతులు లేనందున ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరుకావద్దని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.

ఈ సమావేశంలో ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, ఎస్బిసిఐ శ్రీనివాసరావు ,ఒంగోలు వన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు,రూరల్ ఇన్స్పెక్టర్ శేషగిరి రావు,ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ హాజరత్తయ్య పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *