ఆశాజనకంగా ధాన్యం ధరలు

తాళ్లూరు: నూపర్ ఎల్ నినో ప్రభావంతో లోటు వర్షపాతం ఉన్నప్పటికి బొర్ల క్రింద సాగు చేసిన వరికి ధరలు ఆశాజనకంగా ఉన్నాయని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. కొత్త పాలెం, మాధవరం,

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

మన్నేపల్లి క్షేత్ర పర్యటనలో బాగంగా వరి క్షేత్రాలను, కళ్లాలను రైతుల కాటాలను, లోడ్ చేయు విధానంను పరిశీలించారు. దిగుబడులు హెచ్చు తగ్గులు ఉన్నప్పటికి మార్కెట్ ధరలు ఊరట కల్గిస్తున్నాయని చెప్పారు. ఖరీప్ సీజన్లో 6100 ఎకరాలలో వరి పంట ఈ- క్రాప్ నమోదు చేయగా ఎంటీయూ 1010 రకం 4200 ఎకరాలలో, బిపీటీ 5204 రకం 850 ఎకరాలలో, కె యన్ ఎం 1638రకం 770 ఎకరాలలో, సీ ఆర్ 1009 రకం 280 ఎకరాలలో సాగు చేసారని దీనికి నంబంధించి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పారు. ఎంటీయూ 1010 రకం 75 కేజీలు రూ.1750 నుండి రూ.1900 వరకు, బిపిటి 5204 రకం రూ.2680 నుండి రూ. 2780 వరకు ఉన్నాయని చెప్పారు. పెద్దా పురం, మండ పేట, తెలంగాణ, చెన్నైలకు ధాన్యం వెళ్తుందని వివరించారు.

పారా క్యాట్ డై క్లోరైడ్ కలుపు మందు నిషేదం …

ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం పారా క్యాట్ డై క్లోరైడ్ కు కొత్త రిజిస్ట్రేషన్ నిషేదించబడునని వ్యవసాయాధికారి తెలిపారు. తాళ్లూరులో పురుగు మందుల దుకాణాలను ఆయన మంగళవారం పరిశీలించారు. పారా క్యాట్ మందు విక్రయాలను అమ్మినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *