బేగంపేట అక్టోబర్ 13,(జే ఎస్ డి ఎం న్యూస్ )
శ్రీ కట్ట మైసమ్మ ఆలయాన్ని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ అన్నపూర్ణదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఎమ్మెల్సీ వానిదేవి ఆమె కుమార్తే అజితలు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సతీమణి స్వర్ణ, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సతీమణి వర్ష లు అమ్మవారిని దర్శించు కుని పూజలు నిర్వహించారు. వీరారెడ్డి దంపతులు అమ్మవారిని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఫౌండర్ ఛైర్మన్ చెక్కల సుభాష్ ముదిరాజు దంపతులు, ఈవో వి ఎన్ వి సత్యనారాయణ వారిని షాలువాతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో వి ఎన్ వి సత్యనారాయణ ఫౌండర్ చైర్మన్ చెక్కల సుభాష్ ముదిరాజులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఆలయం ప్రాంగణం మొత్తం వివిధ రకాలైన విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. రంగురంగుల పూలతో ఆలయ ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. అమ్మవారి ఆలయ పరిసరాల్లో అమ్మవారి విద్యుత్ దీపాలతో భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు.




Save or share this story as a newspaper-style Epaper Clip: