అమీర్ పేట శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి దేవీ అలంకారం.

బేగంపేట , (జెఎస్ డిఎం న్యూస్) :
అమీర్ పేట శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో మంగళవారం అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం దశమి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయాన్ని ఈవో వంగా అంబుజా, ఆలయ ఫౌండర్ చైర్మన్ కే మల్లికార్జున పల ఆధ్వర్యంలో పటిష్టమైన ముందస్తు ఏర్పాట్లు చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో వివిధ రకాలైన పూలతో సుందరంగా ఆలయాన్ని ముస్తాబు చేశారు. దశమి రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల వితరణ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *