బేగంపేట అక్టోబర్ 20,(జే ఎస్ డీ ఎమ్ న్యూస్ ) :
బేగంపేట శ్రీ కట్ట మైసమ్మ మహాలక్ష్మి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం అమ్మవారు శ్రీ కట్ట మైసమ్మ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు మంత్రి దామోదర రాజనర్సింహ, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సతీమణి నందిని మల్లు , దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, దాతలు శ్రీనివాసరెడ్డి మనోజ్ కుమార్ తదితరులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఆలయ ఈవో వి ఎన్ వి సత్యనారాయణ, ఫౌండర్ చైర్మన్ చెక్కల సుభాష్ ముదిరాజులు వారితో పూజలు నిర్వహింప చేశారు. ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయంలో ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో విద్యుత్ దీపాలతో అమ్మవారి భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు మంగళవారం రోజు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.





Save or share this story as a newspaper-style Epaper Clip: