సికింద్రాబాద్ అక్టోబర్ 27, ( జేఎస్ డి ఎం న్యూస్ 28) :
సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లి పరిధిలో సంచలనం సృష్టించిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు.పరిచయం ఉన్న ఇంటికే కన్నం వేసి కిలోకు పైగా బంగారు ఆభరణాలు, లక్షలాది రూపాయల నగదు దోచుకెళ్లిన నిందితుడిని మారేడ్‌పల్లి క్రైమ్ బృందం అరెస్ట్ చేసింది. నిందితుడి నుంచి దాదాపు 1.180 కిలోల బంగారు నగలతో పాటు రూ.15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
నెహ్రూనగర్‌లోని వెంకట సాయి రెసిడెన్సీలో నివాసముంటున్న డాక్టర్ శ్రీ ఆచి మోహన్ తన కుటుంబంతో కలిసి ఈ నెల 19న ఖమ్మం జిల్లా ఇల్లందులోని సొంతూరుకు వెళ్లారు. మరుసటి రోజు తిరిగి వచ్చి చూడగా, బెడ్రూమ్ తలుపు తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపల పరిశీలించగా బీరువాలోని సుమారు 1.180 కిలోల బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల నగదు మాయమైనట్లు గుర్తించిన బాధితుడు మారేడ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు, వేలిముద్రలు సేకరించడంతో పాటు స్థానిక సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విచారణలో భాగంగా బోడుప్పల్ రాఘవేంద్ర కాలనీకి చెందిన కార్పెంటర్ వెల్శాల భరత్ (38) ప్రవర్తనపైఅనుమానం వచ్చింది. గతంలో బాధితుడి ఇంట్లో వడ్రంగి పనులు చేసిన భరత్‌కు ఆ ఇల్లు, విలువైన వస్తువులు ఎక్కడ ఉంచుతారనే విషయాలపై పూర్తి అవగాహన ఉంది.
ఆ చనువుతోనే నకిలీ తాళం చెవిని తయారు చేసుకున్న నిందితుడు, కుటుంబ సభ్యులు ఊరెళ్లిన సమయం చూసి ఇంట్లోకి చొరబడి బెడ్రూమ్ తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డాడు.
మల్కాజ్ గిరి డీసీపీ శ్రీధర్,బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి పర్యవేక్షణలో మారేడ్‌పల్లి క్రైమ్ బృందం పక్కా సమాచారంతో నిందితుడు భరత్‌ను అదుపులోకి తీసుకుంది. నిందితుడి నుంచి గాజులు, కడాలు, చైన్లు, హారాలతో సహా 1.180 కిలోల బంగారుఆభరణాలను, రూ.15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఇళ్లల్లో పనివాళ్లు, సర్వీస్ సిబ్బందిని పెట్టుకునేటప్పుడు వారిపూర్వాపరాలను పరిశీలించాలని, ఇళ్లకు నాణ్యమైన తాళాలు, సీసీ కెమెరాలుఅమర్చుకోవాలని పోలీసులు ప్రజలకుసూచించారు. ఊర్లకు వెళ్లే సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: