పట్టభద్రుల ఓటరు నమోదుకు నవంబర్‌ 6 తుది గడువు

హైదరాబాద్‌ అక్టోబర్ 27, ( జె ఎస్ డి ఎం న్యూస్) :
మహబూబ్‌నగర్‌–హైదరాబాద్‌–రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి కొత్త ఓటరు జాబితా రూపకల్పన ప్రక్రియ మొదలైందని సికింద్రాబాద్‌ ఆర్డీవో, సహాయ ఓటరు నమోదు అధికారి పూళ్ల సాయిరాం తెలిపారు. అర్హులైన పట్టభద్రులు నవంబర్‌ 6వ తేదీలోగా ఫారం–18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గుర్తింపు పొందిన డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగిన వారు ధ్రువీకరణ పత్రాలతో ceotserms2.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా కానీ, సంబంధిత నమోదు కేంద్రాల్లో కానీ దరఖాస్తు సమర్పించవచ్చని పేర్కొన్నారు. జాబితాను పూర్తిగా కొత్తగా రూపొందిస్తున్న నేపథ్యంలో గతంలో ఓటర్లుగా నమోదైన వారు సైతం తప్పనిసరిగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *