అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా ఓటర్ గా నమోదు చేసుకోవాలి. ఎమ్మెల్యే తలసాని.

బేగంపేట అక్టోబర్ 30, (జె ఎస్ డి ఎం న్యూస్) :
అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. శుక్రవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట, బేగంపేట డివిజనల్ లలో ఓటరు నమోదు కార్యక్రమం లో పాల్గొన్నారు. పలువురు గ్రాడ్యుయేట్ లు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఓటరు నమోదు పత్రాలను అందజేశారు.
రాంగోపాల్ పేట డివిజన్.…
రాంగోపాల్ పేట డివిజన్ లోని ఓల్డ్ బోయిగూడలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటింటికీ వెళ్ళి 2023 నవంబర్ నాటికి గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ప్రతి గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. గతంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఓటు వేసిన వారు కూడా తిరిగి ఓటరుగా నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా పలువురు గ్రాడ్యుయేట్ లు తమ వివరాలతో కూడిన ఓటరు నమోదు పత్రాలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అందజేశారు. డివిజన్ లో అర్హులైన ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లికార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్, ఆంజనేయులు, కోటేశ్వర్ గౌడ్, రాంమోహన్ యాదవ్, టీనా గౌడ్, చంద్రప్రకాష్, జనార్దన్, అరుణ్ భట్, ఆనంద్ పాటిల్ తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

బేగంపేట డివిజన్.
గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా బేగంపేట డివిజన్ లోని ఎయిర్ లైన్స్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు గ్రాడ్యుయేట్ లు తమ ఓటరు నమోదు పత్రాలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అందజేశారు. కాలనీలో ఉన్న అర్హులైన గ్రాడ్యుయేట్ లు అందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా కాలనీ కమిటీ సభ్యులు కృషి చేయాలని కోరారు. ఆదివారం సెలవు రోజున ప్రతి ఒక్కరు అందుబాటులో ఉంటారని, ఆరోజున కాలనీలోని ఇంటింటికీ వెళ్ళి అర్హులైన గ్రాడ్యుయేట్ లను ఓటరుగా నమోదు చేయించాలని అన్నారు. ఎమ్మెల్యే వెంట కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ టి. మహేశ్వరి, డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు టి. శ్రీహరి, శేఖర్, ఆరీఫ్, అఖిల్, సంజయ్, జావీద్, కాలనీ వాసులు గోపాల్, రాజేంద్రప్రసాద్ తదితరులు ఉన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *