ప్రధానమంత్రిగాపీ. వీ.చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణ విధానాలు దేశ అభివృద్ధికి దోహద పడ్డాయి…. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల.ఔషధ మొక్కల విశిష్టతను చాటిచెప్పిన “ఘనం – పి.వి. వనం” పుస్తకావిష్కరణ.

బేగంపేట, అక్టోబర్ 30, ( జె ఎస్ డి ఎం న్యూస్) :
ప్రధానమంత్రిగా పీ. వీ. నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణ విధానాలు దేశ అభివృద్ధికి దోహద పడ్డాయని,తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల అన్నారు.ఔషధ మొక్కలప్రాముఖ్యత, ప్రకృతి పరిరక్షణ ఆవశ్యకతను వివరించే తెలంగాణ శాసనమండలి సభ్యురాలు సురభి వాణీదేవి రచించిన ఘనం – పి.వి. వనం అనే పుస్తకాన్ని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుక్రవారం బేగంపేట స్వామి రామానంద తీర్థ మెమోరియల్ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ, స్వామి రామానంద తీర్థ మెమోరియల్ కమిటీలు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలోశాసనమండలి ఉపసభాపతి డాక్టర్ బండ ప్రకాశ్, మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మాట్లాడుతూ
ఔషధ మొక్కలపై అవగాహన పెంపొందించే ఈ పుస్తకాన్ని రచించిన వాణీదేవిని అభినందించారు. చెట్లను తొలగించాల్సి వచ్చినప్పుడు వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటి సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు.
అనంతరం పి.వి. నరసింహారావు విగ్రహం వద్ద పూలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మాట్లాడుతూ ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణ విధానాలు దేశ అభివృద్ధికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. సమాచార సాంకేతిక, మొబైల్ వినియోగ రంగాల్లో భారత్ సాధించిన ప్రగతి దేశ అభివృద్ధికి దోహద పడ్డాయాన్నారు.
ఎమ్మెల్సీ సురభి వాణీదేవి మాట్లాడుతూ, అభివృద్ధి పేరుతో ప్రకృతిని దెబ్బతీయకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవాలని అన్నారు. భారతదేశంలోని అరుదైన ఔషధ మొక్కలపై యువతకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో, తన తండ్రి పి.వి. నరసింహారావు దార్శనికత, ఔషధ వనాల స్ఫూర్తితో
ఈ పుస్తకాన్ని రచించినట్లు తెలిపారు.
సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, తులసి, నిమ్మ, ఉసిరి, వంటి మొక్కల్లో ఔషధ గుణాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచి ప్రకృతిని పరిరక్షించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్వామి రామానంద తీర్థ మెమోరియల్ కమిటీ కార్యదర్శి సురభి వాణీదేవి, ఎస్ ఆర్ టి, సెర్ని అధ్యక్షుడు పి.వి. ప్రభాకర్ రావు, శేఖర్ మారం రాజు అజిత, బేగంపేట మాజీ కార్పొరేటర్ టీం మహేశ్వరి శ్రీహరి, అఖిల్ ఆరిఫ్ శ్రీనివాస్ గౌడ్ శేఖర్ ముదిరాజ్, స్వామి రామానంద తీర్థ సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *