బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన అక్రమ ఫెర్టిలిటీ దందా…. బేగంపేట పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) సిబ్బంది సంయుక్తంగాదాడులు.వివిధ రాష్ట్రాలకు చెందిన 13 మంది యువతుల ను అదుపులోకి తీసుకున్న పోలీసులు……నిర్వాకురాలిగా అనుమానిస్తున్న ఓ మహిళను అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్న పోలీసులు……ప్రకాశం నగర్ లో కలకలం.

బేగంపేట అక్టోబర్ 30 (జేఎస్ డీ ఎం న్యూస్) :
బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ ఫెర్టిలిటీ దందా పై బేగంపేట పోలీసులు, ఎస్ఓటి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి వివిధ రాష్ట్రాలకు చెందిన పది మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. నిర్వహకు రాలిగా అనుమానిస్తున్న ఓ మహిళను సైతం పోలీసులు అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అందిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాష్ నగర్ లోని నజ్రాన్ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటూ అక్రమంగా యువతుల అండాలను సేకరించి సమీప సంతాన సాఫల్య కేంద్రాలకు సరఫరా చేస్తున్నారనే సమాచారంతో బేగంపేట పోలీసులు ఎస్వోటీ పోలీసులు సంయుక్తంగా నజ్రాన్ అపార్ట్మెంట్ పై దాడులు నిర్వహించి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో భాగంగా భవనంలోని కింది అంతస్తులో నివాసం ఉంటున్న పలువురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా ఈ భవనంలో బీహార్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రానికి చెందిన 8 నుండి 10 మంది అమ్మాయిలు నివాసం ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. గురువారం రెండు గంటల సమయంలో బేగంపేట పోలీసులతోపాటు ఎస్వోటీ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి యువతులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గత సంవత్సర కాలంగా అమీ నీతా గర్ల్స్ హాస్టల్ పేరిట
ఈ వ్యవహారం నడుస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. యువతులకు సంబంధించిన అండాలను సరఫరా చేస్తున్నారనే విషయంపై పూర్తిస్థాయిలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మల్కాజ్ గిరి సీపీ బడుగుల సుమతి ఆదేశాల మేరకు సంతాన సాఫల్య కేంద్రాలకు పురుషుల వీర్యకణాలను మహిళల అండాలను సరఫరా చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.బేగంపేటలో మహిళల వసతిగృహం అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని అన్ని కోణాలలో ప్రశ్నిస్తున్నారు.
గర్భం దాల్చడం కోసం మహిళల,యువతుల అండాలను విక్రయిస్తున్నారన్న సమాచారంతో ప్రకాష్ నగర్ లో ఉన్న అపార్ట్మెంట్ ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ ఘటనపై బేగంపేట పోలీసులు ఓ మహిళలను నిర్వాహకురాలిగా భావించి అదుపులోకి తీసుకొని అన్ని కోణాలలో విచారిస్తున్నారు.
ఆ మహిళ ఈ యువతులతో ఈ రకమైన వ్యవహారం ఏదైనా నడిపించిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.బేగంపేట ప్రకాశం నగర్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన 10 మంది యువతుల ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
నిర్వాకురాలిగా అనుమానిస్తున్న ఓ మహిళను అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్న పోలీసులు.
ప్రకాశం నగర్ లో కలకలం. నగరంలో తీవ్ర కలకలం రేపింది. ప్రకాష్‌నగర్ ప్రాంతంలో అనుమతులు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారంపై బేగంపేట పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) సిబ్బంది సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. నివాస గృహాల మధ్య నడుస్తున్న ఈ కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా మహిళల అండాలను, పురుషుల వీర్యకణాలను సేకరించి, నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రకాష్‌నగర్‌లోని ఒక నివాస భవనంలో ‘అమినీతా గర్ల్స్ హాస్టల్’ పేరిట ఈ చీకటి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇతర రాష్ట్రాలైన బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశాల నుంచి నిరుపేద యువతులను నగరానికి రప్పించి, ఒక అద్దె ఇంట్లో ఉంచి వారి నుంచి బలవంతంగా లేదా ప్రలోభపెట్టి అండాలను సేకరిస్తున్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇక్కడ ఉంటున్న దాదాపు 8 నుంచి 10 మంది యువతులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. వీరి నుంచి సేకరించిన అండాలను, అలాగే సేకరించిన వీర్యకణాలను సమీపంలోని ఫెర్టిలిటీ సెంటర్లకు భారీ మొత్తాలకు విక్రయిస్తున్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.
ఈ దందాలో ఒక మహిళ ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తూ నెట్‌వర్క్‌ను నడిపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సదరు మహిళతో పాటు కేంద్రంలో పట్టుబడిన పలువురు సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ఈ అక్రమ సేకరణ ప్రక్రియల వెనుక ఏయే ఆసుపత్రులు, ప్రముఖ ఫెర్టిలిటీ కేంద్రాల హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. చట్టవిరుద్ధంగా కొనసాగుతున్న ఈ ముఠా మూలాలను ఛేదించేందుకు ప్రత్యేక బృందాలు విస్తృత తనిఖీలు కొనసాగిస్తున్నాయి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *