తాళ్లూరు లోకిరెడ్డి గోవిందమ్మ ఇంటింటి ప్రచారం-వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించిన అభ్యర్థి

తాళ్లూరు: మండల వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి లోకిరెడ్డి గోవిందమ్మ తాళ్లూరు గ్రామంలో శుక్రవారం రాత్రి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆమెకు స్వాగతం పలికారు.ప్రచారంలో భాగంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన ప్రయోజనాలను ఆమె వివరించారు. అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై తన అభిప్రాయాలను గ్రామస్తుల ముందు ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వంలో నిత్యవసర సరుకులు రేట్లు అధికంగా ఉన్నాయని రైతుల గిట్టుబాటు ధర కూడా లేదని , జగన్ ప్రభుత్వం వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *