మల్కాజ్ గిరి నవంబర్ 2, (జె ఎస్ డిఎం న్యూస్) :
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపించేందుకు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం మొత్తం 17 దరఖాస్తులు వచ్చాయి. సోమవారం ప్రజావాణిలో
టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి 10 దరఖాస్తులు,ఇంజినీరింగ్ విభాగానికి 4 దరఖాస్తులు,ల్యాండ్ అక్విజిషన్ కు 1
ట్రేడ్ లైసెన్స్ కు 1
ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కు 1
మొత్తం 17 దరఖాస్తులు అందగా, వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపించి, ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రజావాణి ద్వారా ప్రజలకు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చే అవకాశం కల్పిస్తూ, ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం, వేగవంతమైన సేవలకు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రాధాన్యతనిస్తోంది.



Save or share this story as a newspaper-style Epaper Clip: