బేగంపేట నవంబర్ 8(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా బేగంపేట సీనియర్ కాంగ్రెస్ నాయకులు విశాల్ సూదం ఆధ్వర్యంలో పేదలకు భోజనం పంపిణి చేసారు. భోజనంతో పాటు పండ్లను కూడా పంపిణి చేశారు.డివిజన్ పరిధిలోని ఓల్డ్ కస్టమ్ బస్తీలో ఉన్న జీహెచ్ఎంసీ నైట్ షెల్టర్ లో నిరుపేదలకు భోజన బాక్సులు పంపిణీ చేశారు. ఆర్గనైజర్ సిద్ధిఖ్ ఖాన్ మరియు డివిజన్ అధ్యక్షుడు మహమ్మద్ నసీర్ అతిధులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సిహెచ్ రాజేందర్, మహమ్మద్ సలీం, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీకాంత్, అక్బర్, మునీర్ ఖాన్ మణి, ధనలక్ష్మి, భాగ్య, స్వప్న, జమీర్, ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: