హైదరాబాద్ నవంబర్ 8(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
మాదకద్రవ్య రహిత భారతదేశం కోసం నిరంతరం కృషి చేస్తున్న వేక్ అప్ హ్యుమానిటీ సంస్థ, దాని వ్యవస్థాపకులు సయ్యద్ నూర్,
వారి బృందాన్ని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఘనంగా సత్కరించారు.కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి నాయకత్వంలో నిర్వహించినహైదరాబాద్ వాక్స్ – నషా ముక్త్ భారత్ సమన్వయ సమావేశంలో, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి నిరంతరం కృషి చేస్తున్న వేక్ అప్ హ్యుమానిటీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, ఇండో-కెనడియన్ న్యాయవాది సయ్యద్ నూర్, వారి బృందాన్ని ఘనంగా సత్కరించడం తో పాటు అభినందించారు.ఈ సందర్భంగా వేక్ అప్ హ్యుమానిటీ సంస్థ చేపడుతున్న వివిధ మానవతా సేవలు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, గత కొన్నేళ్లుగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్ధాలు, వ్యసనాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక *నషా ముక్త్ భారత్* ప్రచార ఉద్యమాన్ని వివరించే సంస్థ బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో
వేక్ అప్
హ్యుమానిటీ సంస్థ ఉపాధ్యక్షులు న్యాయవాది మొహమ్మద్ ముదస్సిర్ జుహా , సభ్యులు అడ్వకేట్ జి. లలిత్ కుమార్ సంస్థకు చెందిన ఇతర బృంద సభ్యులు పాల్గొన్నారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి వీరంతా నిరంతరం కృషి చేస్తున్నారు.
ఈ సందర్భంగా అడ్వకేట్ సయ్యద్ నూర్ మాట్లాడుతూ, యువతను చైతన్యవంతం చేయడం, ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ప్రభుత్వ సంస్థలు, ప్రజాప్రతినిధులు మరియు పౌర సమాజంతో కలిసి పనిచేయడం ద్వారా మాదకద్రవ్య రహిత భారతదేశాన్ని నిర్మించేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందనిపునరుద్ఘాటించారు.మాదకద్రవ్యాలపై పోరాటం రాజకీయాలు, మతాలు మరియు సామాజిక భేదాలకు అతీతంగా సాగాలని, యువతను మరియు భావితరాలను రక్షించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని కోరారు.ఒకే దేశం – ఒకే స్ఫూర్తి – ఒకే లక్ష్యం.నషా ముక్త్ భారత్ ను మరింతగా ప్రజల్లోకి, ముఖ్యంగా యువత ను ఆ మార్గం వైపు వెళ్లకుండా కట్టడి చేసేందుకు తాము అహర్నిశలు కృషి చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: