వివిధ శాఖల సంక్షేమ వసతి గృహాలలో చదువుకుంటున్న విద్యార్థుల పట్ల సంబంధిత శాఖ అధికారులు నైతిక బాధ్యత తో వ్యవహరించాలి – జిల్లా కలెక్టర్ పి. రాజబాబు

వివిధ శాఖల సంక్షేమ వసతి గృహాలలో చదువుకుంటున్న విద్యార్థుల పట్ల సంబంధిత శాఖ అధికారులు నైతిక బాధ్యత తో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ పి. రాజబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సంక్షేమ శాఖ అధికారులతో పీపుల్స్ పాజిటివ్ పర్సెప్షన్ పై( పి పి పి) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాలలో మెరుగైన వసతులు కల్పించాలని మెనూ ప్రకారం భోజనం అందించాలని అదేవిధంగా త్రాగునీరు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలన్నారు. సమస్యలు ఉన్నచోట సంబంధిత అధికారులకు క్షేత్ర స్థాయిలో పరిశీలించి అక్కడే ఉండి సమస్యలను పరిష్కరించాలని ఆయన అన్నారు. విద్యాలయాలలో బోధన సామర్థ్యం పెంచాలని దానికి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులలో సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై సానుకూల దృక్పథం ఉండేలా చూడాలన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. సంతృప్తి స్థాయి 80 నుంచి 90 శాతానికి పెంపొందించాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. గిరిజన సంక్షేమ వసతి గృహాలలో కూడా బోధన సామర్థ్యం పెంపొందించడంతోపాటు మంచినీరు సరైన భోజనం ఏర్పాటు చేయాలన్నారు. మెనూ ప్రకారం భోజనం వడ్డిస్తున్నది తెలుసుకునే విధంగా ఫోటోలు తీసి ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. రోజు ఎంతమంది పిల్లలు వస్తున్నారు తదితర విషయాలను నిశితంగా పరిశీలించాలన్నారు .
ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్ .లక్ష్మ నాయక్, బీసీ సంక్షేమ శాఖ అధికారి జ్యోతి, గిరిజన సంక్షేమ శాఖ అధికారిని వరలక్ష్మి మరియు సాంఘిక సంక్షేమ శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *