కొరిశపాడు: తెలుగు చలనచిత్ర సినీ నటుడు గిరిబాబు అంతిమయాత్ర ఘనంగా సాగింది. జానపద సాంఘిక చిత్రాలతో ప్రేక్షకులను అలరించి సొంత బ్యానర్ పై చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించి చలనచిత్ర రంగానికి సేవలందించిన విభిన్నమైన వ్యక్తిత్వం కలిగిన మహామనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు . సినీ పేరు గిరిబాబు
జననం 8 జూన్ 1946 సంవత్సరములో ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం,రావినూతల గ్రామం నందు జన్మించారు.భార్య శ్రీదేవి, కుమారులు రఘుబాబు, బోసుబాబు, కుమార్తె మాధవి ముగ్గురు సంతానం. సినీ ప్రస్థానం చిన్నప్పటి నుంచే నాటకాలపై ఆసక్తి ఉండేది, సినిమాల్లో నటించాలనే ఆశతో మద్రాసు వెళ్లారు. 1973లో జగమే మాయ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు.
మొదట విలన్ పాత్రల్లో నటించారు. తరువాత హీరోగా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రలు పోషించారు. ఐదు దశాబ్దాల సినీ జీవితంలో 600కు పైగా సినిమాల్లో నటించారు.ఆయన పెద్ద కుమారుడు రఘుబాబు తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ హాస్యనటుడిగా కొనసాగుతున్నారు. చిన్న కుమారుడు బోసుబాబు కూడా సినిమాల్లో నటించారు. గిరిబాబు నవంబర్ 14న హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు అని కొన్ని వార్తా సంస్థలు, 83 సంవత్సరాలు అని మరికొన్ని వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
గిరిబాబు ప్రత్యేకత:
విలన్‌గా భయపెట్టినా, హాస్యనటుడిగా నవ్వించినా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆకట్టుకున్నా తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.





Save or share this story as a newspaper-style Epaper Clip: