బ్రెయిన్ స్ట్రోక్ నివారణపై అవగాహన కోసం హైదరాబాద్‌లో భారీ 5కే పరుగు…2,000 మందికిపైగా ఉత్సాహంగా పాల్గొన్న రన్నర్లు.

హైదరాబాద్, నవంబర్ 15, (జే ఎస్ డి ఎం న్యూస్ ) :
బ్రెయిన్ స్ట్రోక్ నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఆదివారం నగరం లోని నెక్లెస్ రోడ్ హెచ్ ఎం డి ఏ గ్రౌండ్స్‌లో గౌతమ్ న్యూరో కేర్ హాస్పిటల్స్, సరళా దేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ మధు మధుయాష్కి గౌడ్ హాజరై రన్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మధు యాష్కి గౌడ్ మాట్లాడుతూ, నేటి కాలంలో యువత కూడా బ్రెయిన్ స్ట్రోక్ బారినపడుతుండటం ఆందోళనకరమైన విషయమని, స్ట్రోక్‌కు సంబంధించిన ప్రమాద కారకాలు, లక్షణాలు మరియు నివారణ మార్గాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని పేర్కొన్నారు.కార్యక్రమ నిర్వాహకులు, ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ ఉదయ్ గౌతమ్
మాట్లాడుతూ, బ్రెయిన్ స్ట్రోక్ అనేది కేవలం వృద్ధులకు మాత్రమే వచ్చే వ్యాధి కాదని, 45 సంవత్సరాల లోపు యువతలో కూడా స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. చిన్న వయసులోనే అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, మద్యపానం, నిద్రలేమి, ఒత్తిడి మరియు శారీరక వ్యాయామం లేకపోవడం వంటి అంశాలు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయని వివరించారు.రోజువారీ వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నిద్ర, రక్తపోటు మరియు షుగర్ నియంత్రణతో పాటు చెడు అలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. స్ట్రోక్ లక్షణాలు కనిపించిన వెంటనే సమయం వృథా చేయకుండా అత్యవసర వైద్య చికిత్స పొందాలని సూచించారు.
ఈ రన్‌లో 2,000 మందికి పైగా రన్నర్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొని బ్రెయిన్ స్ట్రోక్ నివారణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, లియో క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ప్రజారోగ్య పరిరక్షణ, యువతలో ఆరోగ్య అవగాహన పెంపొందించడం మరియు బ్రెయిన్ స్ట్రోక్ నివారణ సందేశాన్ని ప్రతి ఒక్కరికీ చేరవేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *