ట్రాఫిక్ ఏఎస్ఐ శ్యామలకు పోలీస్ఉన్నతాధికారుల ప్రోత్సాహం..శ్యామలను అభినందించిన మల్కాజ్ గిరి సిపి సుమతి.2027 లో జపాన్ లో జరగనున్న మాస్టర్ గేమ్స్ వెపన్ షూటింగ్ లో పాల్గొనేందుకు అండగా ఉంటామంటూ డీ జీ పీ, సి పీ ల మద్దతు…

హైదరాబాద్ నవంబర్ 15,(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే ఆ మహిళ ఏ ఎస్సై మరోవైపు తనలోని క్రీడ స్ఫూర్తితో జాతీయస్థాయిలో పథకాలు సాధించి పలువురికి ఆదర్శంగా నిల్చింది. ఏఎస్ఐ వీ.శ్యామల ట్రాఫిక్ విధులతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇంకో వైపు జాతీయ స్థాయిలో వివిధ క్రీడలలో తన ప్రతిభను చూపి 63( బంగారు వెండి రజత) పథకాలను వివిధ సర్టిఫికెట్లను సాధించింది. వీటితోపాటు ఏడు జాతీయస్థాయి అవార్డులు రెండు డాక్టరేట్లను సైతం సంపాదించు కుంది. విధి నిర్వహణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు క్రీడలలో పాల్గొంటూ అవార్డులను సొంతం చేసుకుని పలువురికి ఆదర్శంగా నిలిచింది. 20 27వ సంవత్సరములో జపాన్లో జరగనున్న మాస్టర్ గేమ్స్ వెపన్ షూటింగ్లో పాల్గొనేందుకు తనకు ఆర్థిక పరిస్థితులు అడ్డుగా మారడంతో తెలంగాణ రాష్ట్ర డిజిపి సి.వి ఆనంద్ ను కలిసి పరిస్థితిని వివరించడంతో స్పందించిన డిజిపి వాల్టర్0.2 వెపన్ ను అందించేందుకు తన వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చి ప్రోత్సహించారని, ఇటీవల మల్కాజిగిరి సిపి సుమతిని కలిసి తనకు వచ్చిన మెడల్స్ తో పాటు నంది అవార్డును సైతం చూపించి సిపి చేతుల మీదుగా అవార్డును అందుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని ప్రోత్సాహాన్ని అందించినట్లు అయిందని శ్యామల తెలియజేశారు. సిపిని కలిసిన సందర్భంగా జపాన్ లోజరగనున్న మాస్టర్ గేమ్స్ వెపన్ షూటింగ్ లో తప్పకుండా పాల్గొనాలని సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృత పరచాలని,ఆ విషయంలో తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని భరోసా ఇచ్చినట్లు శ్యామల తెలియజేసింది. మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్, డే స్ప్రింగ్ ఫియాలాజికల్ యూనివర్సిటీలు తన కు డాక్టరేట్ అందజేసినట్లు ఆమె తెలిపారు. తనకు వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న డీజీపీ సివి ఆనంద్, మల్కాజ్గిరి సిపి సుమతి ల ప్రోత్సాహన్ని తాను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానని, ముందుకు సాగుతానని, ఈ సందర్భంగా వారిరువురికి శ్యామల కృతజ్ఞతలు తెలియజేసారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *