నవంబర్ 15,(జే ఎస్ డీ ఎం న్యూస్ ) : సనత్ నగర్ నియోజకవర్గం బేగంపేట డివిజన్ ఓల్డ్ పాటిగడ్డలో జరిగిన గ్యార్వి ఉత్సవాల్లోమాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం పాల్గొన్నారు. ముందుగా ఓల్డ్ పాటిగడ్డ లో నిర్వహించిన గ్యార్వీ షరీఫ్ కు హాజరై ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొన్నారు.అనంతరం ఎన్ బి టి నగర్ లో నిర్వహించిన గ్యార్వీ షరీఫ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రార్ధనల అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే ను సన్మానించారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు టి. శ్రీహరి, శేఖర్, ఆరీఫ్, అఖిల్, నాగరాజు గౌడ్, సంజయ్, మొయిన్, జావీద్, అడ్డు, ఇర్ఫాన్, ఖలీద్, నసీమా తదితరులు పాల్గొన్నారు.




Save or share this story as a newspaper-style Epaper Clip: