తాళ్లూరు: ఈ నెల 26న దళిత బహుజనులందరూ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నీలం నాగేంద్రరావు పిలుపుని చ్చారు. తాళ్లూరు మండల కార్యాల యాల వద్ద విలేకర్లతో బుధవారం మాట్లాడారు. దళితుల పోరాటాలు, ఆచరణల వల్లే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహి స్తున్నాయని అన్నారు. 1949లో నవంబరు 26 తేదీనే రాజ్యాంగానికి ఆమోద ముద్ర పడినా అప్పటి నుంచి రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని నిర్వహించలేదన్నారు. 2015 నుంచే దీనిని నిర్వహించడం ఆరంభమైందన్నారు. మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు దార అంజయ్య, కాకుమాను రవి, బంటుపల్లి ప్రకాశం, అనపర్తి సుబ్బారావు, సామ్యేలు, యల మంద తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: