బేగంపేట నవంబర్ 24,(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
ఆధ్యాత్మిక శోభతో ఉన్న ఆలయాల్లో పరిశుభ్రత ఎంతో ముఖ్య మని, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన పిలుపునిచ్చారు. ఎస్పీ రోడ్ శ్రీ వీర హనుమాన్ దేవాలయంలో వున్న
శ్రీ వల్లి దేవసేన సమేతసుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో ఖాళీ పాల ప్యాకెట్లు, ఇతరత్రా కవర్లు ఆలయ ప్రాంగణంలో పడి ఉండటాన్ని కాట్రగడ్డ ప్రసూన గమనించారు.వెంటనే చీపురు చేతపట్టి ఆలయంలోని కవర్లు ఇతరత్రను ఊడ్చి శుభ్రం చేశారు.
స్వచ్ఛభారత్ ఇన్ క్రెడిబుల్ ఇండియా పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీదేవాలయాలను శుభ్రం చేసి ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛభారత్ స్వచ్ఛ ఆంధ్ర తెలంగాణ పిలుపును ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. దేవాలయాలను మనం పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆ పరమశివుని అమ్మవారి కరుణాకటాక్షాలు పరిపూర్ణంగా లభిస్తాయని కాట్రగడ్డ పేర్కొన్నారు కార్తీక పౌర్ణమి వేల శ్రీ వీర హనుమాన్ దేవస్థానంలో ఉన్న వెళ్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శించుకోవడం ఆలయ పరిశుభ్రతలో పాలుపంచుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే పర్వదినాల్లో ఆలయ ప్రాంగణాల పరిశుభ్రతను కాపాడుకోవడం మన అందరి బాధ్యతగా ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు భక్తి అంటే కేవలం పూజలు చేయడమే కాదు భగవంతుడు కొలువైన ప్రదేశాన్ని పవిత్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా భక్తుల బాధ్యత అని కాట్రగడ్డ ప్రసూన అన్నారు.మాజీ ఎమ్మెల్యే వెంట టిడిపి సీనియర్ నాయకులు మాణిక్యం బండారు రాజు, గోవింద్ అశోక్ సుమంత్ నర్సింగ్ తదితరులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆలయంలో పరిశుభ్రత కోసం చేపట్టిన ఈ చర్యను చూసి భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: