బేగంపేట నవంబర్ 25,(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
మత్తు పదార్థాలకు నేటి యువతను దూరంగా ఉంచేందుకు, ఈ విషయంలో సమాజంలోని ప్రజలకు అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రేరణ మేరకు, కేంద్ర మంత్రివర్యులు,
జి. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో నేటి నుండి మూడు రోజుల పాటు నషా ముక్త్ భారత్ పాదయాత్ర ప్రారంభించారు.
ఈ పాదయాత్ర బుధవారం సాయంత్రం సనత్ నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్ పేట్, పద్మారావు నగర్ డివిజన్ల మధ్య ఉన్న గాంధీ ఆసుపత్రి వద్దకు చేరుకుంది.
ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు, NDMA మాజీ ఉపాధ్యక్షులు పెద్దలు మర్రి శశిధర్ రెడ్డి గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు వైద్య విద్యార్థులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై కిషన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితరులు ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో పార్లమెంటు కన్వీనర్ రాజశేఖర రెడ్డి , బిజెపి రాష్ట్ర యువ నాయకులు మర్రి పురురవా రెడ్డి, జిల్లా OBC మోర్చా అధ్యక్షులు వై. సురేష్ కుమార్ అనేక మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొని పాదయాత్రకు స్వాగతం పలికి, ముందుకు సాగారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: