దొనకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆర్ఎస్ లో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈఓ – 1 సాంబశివరావు ఎంఈఓ 2 , పాఠశాల ప్రధానోపాధ్యాయులు వివి రామాంజనేయులు , ఉమ్మడి ప్రకాశం జిల్లా (IRCS) ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి, మానవత స్వచ్చంద సేవా సంస్థ సెంట్రల్ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు . రాజ్యాంగ దినోత్సవ ప్రాధాన్యత గురించి వక్తలు వివరించారు. అనంతరం అతిధిగా పాల్గొన్న కపురం శ్రీనివాసరెడ్డిని ఘనంగా సన్మానించారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: