తాళ్లూరు: పంచాయితీ ఎన్నికల నిర్వహణలో పీఓలు, ఎపీఓలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆర్ ఓ , ఎంపీడీఓ అజిత కోరారు. 29న పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో శు క్రవారం పీఓ లకు, ఎపీఓలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంఈఓ జి నుబ్బయ్య మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, సకాలంలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం, నిబంధనల మేరకు పోలింగ్ కేంద్రాలలోనికి అనుమతులు, ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం ఓట్ల లెక్కింపు, ఫలితాలు జాప్యం లేకుండా పంచాయితీ వెబ్ సైట్లో నమోదు చేయటానికి సమాచారం నకాలంలో అందజెయ్యాలని కోరారు. క్షేత్ర స్థాయిలో మైక్రో అజ్వర్వర్లు కూడ నిశితంగా పరిశీలిస్తారని, ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలని కోరారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: