విద్యతో పాటు యుద్ధవిద్యలోనూ, సాహిత్యంలోనూ తనదైన ముద్ర వేసిన శ్రీ భక్త కనకదాసు నేటి యువతకు ఆదర్శనీయం – జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

విద్యతో పాటు యుద్ధవిద్యలోనూ, సాహిత్యంలోనూ తనదైన ముద్ర వేసిన శ్రీ భక్త కనకదాసు నేటి యువతకు ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ .పి.రాజాబాబు అన్నారు. కనకదాసు జయంతిని పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నతనంలోనే విద్యతోపాటు యుద్ధవిద్యలలో ఆరితేరి విజయనగర సామ్రాజ్యంలో దళపతిగా (నాయకుడిగా) పనిచేశారని చెప్పారు. కనకదాసు సామాన్యులకు సైతం అర్థమయ్యే సరళమైన కన్నడ భాషలో సుమారు 240కి పైగా కీర్తనలు రచించారని తెలిపారు. తన రచనల్లో ‘ కాగినెలె ఆదికేశవ ‘ అనే ముద్రను ఉపయోగించారని, కులమత భేదాలు, మూఢనమ్మకాలను ఖండిస్తూ సమాజంలో సమానత్వం కోసం కృషి చేశారని కొనియాడారు. ఎంతో గొప్ప వ్యక్తిత్వం కలిగిన కనకదాసును నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని తాము ఎంచుకున్న రంగంలో రాణించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పి.వెంకటరమణ, జిల్లా బీసీ సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి, ఇతర అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *