ప్రకాశం జిల్లా Special Enforcement Bureau officer (DSEO) ఆదేశముల మేరకు గోవా రాష్ట్రము నుంచి అక్రమ దారిలో తరలించుకోనివచ్చి దర్శి, పరిసర ప్రాంతాలలో దానిని విక్రయిస్తున్న పోరుగుమద్యం(NDPL)ను, దాని అమ్మకం దారుని ఆదివారం అరెస్ట్ చేసినట్టు ఒంగోలు ఎన్ఫోర్స్మెంట్ Superintendent ఎ. ఆవులయ్య తెలిపారు. ఈ మేరకు అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ Superintendent యం. సుదీర్ బాబు తో కలిసి ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. దర్శి మండలం యర్రఓబనపల్లె కు చెందిన పేరం. నాగార్జునరెడ్డి అనే ముద్దాయిని అదుపులోకి తీసుకుని అతని వాన్గ్మూలము మేరకు మరో ఇద్దరి ని ఈ అక్రమ వ్యాపారములో సూత్రదారులుగా నిర్ధారించినట్లు వివరించారు. పరిశోధనలో భాగంగా దొనకొండ మండలం ఆరవల్లిపాడు కు చెందిన వేముల రామయ్య ను అదుపులో కి తీసుకుని అతనితో పాటు సదరు నేరములో భాగస్వాములుగా ఉన్న మరో ముగ్గురిని ముద్దాయిలుగా చేర్చడం జరిగిందని తెలిపారు. మొత్తం 6 కేసులు 180 యం.యల్. పరిమాణము గల మద్యాన్ని 288 బాటిల్స్) మద్యాన్ని సీజ్ చేసి, ఈ మద్యం తరలింపు లకు ఉపయోగించిన 2 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు క్రమం కొనసాగుతుందని సంబంధం ఉన్న వారందరిని పట్టుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో దర్శి సెబ్ సి.ఐ బి. సుందర రామయ్య, పొదిలి సెబ్ సి.ఐ షేక్. ఖాజమొహిద్దీన్, యస్.ఐ శ్రీధర్ బాబు పాల్గొన్నారు. కేసు దర్యాప్తు పూర్తీ అయిన తరువాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 6 గురు నీ నిందితులుగా గుర్తించబడ్డారు అని అన్నారు.
