దర్శి మండలం రాజంపల్లిలో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమరావతి నుండి రాయలసీమ జిల్లాలకు రాక పోకలు సాగించటానికి దగ్గరి మార్గం కావటంలో వాహనాలు అధిక సంఖ్యలో ఈ ప్రధాన దారిలో ప్రయాణిస్తుంటాయి. అయితే మేజర్ పంచాయితీ అయిన రాజంపల్లిలో దుకాణాల అధిక సంఖ్యలో రోడ్ల వెంబడి ఉండటంతో వినియోగదారులు తమ వాహనాలను రోడ్డు వెంబడి పార్క్ చేసి తమ పనులు చూసుకుంటూ ఉంటారు. ఆటోలు సైతం రోడ్లపై నిలుపు దల చేయటంతో ట్రాఫిక్ సమస్యలు మరింత జఠిలం అయ్యాయి. రెండు వైపుల రాక పోకలు సాగించటానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్తులు సైతం రోడ్డు వెంబడి ప్రయాణించాలంటే హడలి పోతున్నారు. పలు మార్లు ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నారు. పంచాయితీ పోలీస్ శాఖ అధికారులు దృష్టి సారించి వాహనాల దుకాణాల వెంబడి నిలప కుండా, రోడ్డు వెంబడి ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరణ చెయ్యాలని ప్రజలు కోరుతున్నారు.
రాజంపల్లిలో ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు – రోడ్ల పైనే వాహనాలు నిలుపు తున్న వాహనదారులు – ఇబ్బందులు పడుతున్న వాహన దారులు – ప్రజలు- పంచాయితీ, పోలీస్ శాఖలు అదుపు చెయ్యాలని ప్రజలు వేడుకోలు
12
Feb