దామోదర సంజీవయ్య కు ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర దళిత సేన, ప్రజా సంఘాల నాయకులు

దర్శి ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం రాష్ట్ర దళిత సేన, దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి బహుముఖ ప్రజ్ఞాశాలి,దేశం గర్వించదగ్గ మహనీయుడు దామోదర్ సంజీవయ్య 102వ జయంతి సభ పోతవరం మాజీ సర్పంచ్ కోట నాగేంద్ర అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గర్నెపూడి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ …. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి, సంక్షేమ పథకాలను దళిత బడుగు బలహీన వర్గాల కోసం అందించిన మహనీయులు దామోదర్ సంజీవయ్య అని కొనియాడారు .ఆయన జీవితం ఆదర్శనీయమని వారు అన్నారు.
యాదవ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొల్లవరం రంగారావు మాట్లాడుతూ … భారతదేశంలోని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా, ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాల కోసం భారత రాజ్యాంగానికి లోబడి తన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బడుగు బలహీన వర్గాల కోసం ..అనేక అంబేద్కర్ రచించిన రాజ్యంగ సంక్షేమ ఫలాలను అందించిన మహనీయులు దామోదర సంజీవయ్య అని వివరించారు.
కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు రాచపూడి బాబురావు, పెందుర్తి కనకారావు,సత్యం, గొల్లపాటి మార్క్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *