ప్రత్తి పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటలే మేలు –
రైతులకు వ్యవసాయ అధికారి ప్రసాదరావు సూచన

ఫిబ్రవరి మాసంలో ప్రత్తి
పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటలే రైతులకు లాభాలు కలిగిస్తాయని మండల వ్యవసాయాధికారి బి.ప్రసాదరావు అన్నారు. క్షేత్ర పర్యటనలో భాగంగా గురువారం లక్కవరం, దోసకాయలపాడు, బెల్లంకొండవారిపాలెం గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ …రైతులు వరి కోసిన వెంటనే ప్రత్తి పంట వైపు మొగ్గు చూపుతున్నారని, ఫిబ్రవరి నెలలో ప్రత్తి పంట వేయడం తగిన లాభదాయకం కాదని ఆయన తెలిపారు. ప్రస్తుత సమయంలో పగటి సమయంలో ఉష్ణోగ్రతలు పెరగడం, రాత్రి సమయంలో మంచు కురుస్తుండడం వల్ల ప్రత్తి పంటకు ఎర్ర గొంగళి పురుగు వ్యాపించే అవకాశం ఉందని …దీనివల్ల ఖర్చులు పెరిగి రైతులకు నష్టాలు పెరగడం తప్ప ప్రయోజనం ఉండదని ఆయన తెలిపారు. దీనికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలుగా చిరుధాన్యాలను సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు వీరాంజనేయులు, భార్గవి, రైతులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *