ముండ్లమూరు( మండలంలోని మక్కినేని వారి పాలెం గ్రామానికి చెందిన వివాహిత నిమితం శివకుమారి (30) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను బుధవారం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. దీంతో మృతురాలి తండ్రి అయినా బత్తిన శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ ఎల్ సంపత్ కుమార్ తెలిపారు. పాత గుంటూరు బాలాజీ నగర్ కు చెందిన అయినా బత్తిన శివ కుమా రిని ముండ్లమూరు మండలం మక్కినేని వారి పాలెం గ్రామానికి చెందిన నిమి తం సాయికి 2019లో ఇచ్చి వివాహం చేశారు. భర్త సాయి ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తూ ఇటీవల టాటా ఏసీ ఆటోను ఫైనాన్స్లో కొనుగోలు చేశాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో తోపాటు పిల్లలు లేరని నిరాశతో. అనారోగ్య సమస్యలు తోడవడంతో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింద నీ కుటుంబ సభ్యులు తెలిపారు.
పురుగు మందు త్రాగి వివాహిత ఆత్మహత్య
16
Feb