దాతల సేవాగుణం అభినందనీయం

పాఠశాల అభివృద్ధికి దాతలు చూపిన సేవాగుణం అభినందనీయమని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎల్ సుజాత అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడాభివృద్ధి కి ఫిజికల్ డైరెక్టర్ జి భావన్నారాయణ శిష్యుడు గుర్రం పెద్దబ్బాయి మనుమడు గుర్రం మురళి 8000 వేల రూపాయలు. పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు నరసింహారావు 5000వేల రూపాయలను విరాళంగా పాఠశాల కు అందజేశారు. ఈ సందర్భంగా వీరి ఇరువురిని ఘనంగా సన్మానించి దుశ్యాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ విద్య నేర్పిన గురువుల పట్ల వారు చూపిన ప్రేమ ఆప్యాయతలు అభినందనీయమన్నారు. పాఠశాలపై ఉన్న మమకారంతో అభివృద్ధికి సహకరించటం కష్టపడే మనస్తత్వం కలిగి ఉండడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చక్రపాణి .బాబురావు. నాగేశ్వరరావు. భారతి. విజయనిర్మల. జ్యోతి. ప్రభావతి. ప్రణతి .శ్రీనివాసరావు సత్యనారాయణ. తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *