ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఓటుకు ఆధార్ అనుసంధానం చేయించుకోవాలని డిప్యూటీ తహసిల్దార్ జి పుల్లారెడ్డి అన్నారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం వీఆర్వోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో భూముల కు సంబంధించిన రికార్డులు సిద్ధం చేసుకోవాలన్నారు. భూముల రి సర్వే సందర్భంగా ఎలాంటి లోపాలు లేకుండా చూడాలన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు కార్డుకు ఆధార్ అనుసంధానం చేయించుకోవాలి అన్నారు. పట్టాదారు పాస్ పుస్తకం కొరకు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు ముందుగా వాటికి సంబంధించిన రిపోర్టులు కార్యాలయంలో ఇవ్వాలన్నారు. ఆదాయం . కులం. ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రీ సర్వే డిప్యూటీ తహసిల్దార్ టి రవికాంత్. సీనియర్ అసిస్టెంట్ పోగుల శేషగిరిరావు. వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు
ఓటుకు ఆధార్ అనుసంధానం చేయాలి
17
Feb