జగనన్న కాలనీలో గృహాలు త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారి బి రవీంద్రబాబు కోరారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయాల్లో శుక్రవారం సచివాల యా ఇంజనీరింగ్ అసిస్టెంట్ తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహాలు పూర్తయ్యేంతవరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారుల ను ఆయన ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న సిమెంట్ ఇనుము లబ్ధిదారులకు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కే కుసుమ కుమారి. మండల పరిషత్ ఏవో బి రామాంజనేయులు హౌసింగ్ ఏఈ హనుమంతరావు. సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
జగనన్న కాలనీలో గృహాలు పూర్తి కావాలి
17
Feb