హర హర మహాదేవ .శంభో శంకర. అంటూ భక్తులు చేసిన స్మరణతో శివాలయాలు మార్మోగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులతో శనివారం దేవాలయా లుకిట కిట లాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు వెళ్లి పూజాది కార్యక్రమాలు చేపట్టారు. ముండ్లమూరు మండలంలోని అన్ని శివాలయాల్లో పూజలు సాగాయి.. పెదరావిపాడు గ్రామంలో గల శ్రీ భ్రమరాంబ సమేత రాజ మల్లేశ్వర స్వామి. ముండ్లమూరు లో మండ్ల మాంబసమేత మల్లికార్జున స్వామి. మారెళ్ళలో హరిహరదత్త క్షేత్రంలో భ్రమరాంబ సమేత చెన్న మల్లేశ్వర స్వామి. పసుపు గల్లులో గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి. పులిపాడులో గంగా అన్నపూర్ణ సమేత పూర్ణేశ్వర స్వామి. ఈ ధరలో గంగా పార్వతీ సమేత ఉమామహేశ్వర స్వామి. ఆలయాల ఆలయాలలో అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. స్వాములను ప్రత్యేక అలంకారంలో అలంకరించారు. ఆలయాల వద్ద భక్తులకు అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాల వద్ద భజనలు పలు సాంస్కృతి కార్యక్రమాలు జరిగాయి. పూజారులైన దుర్భాకుల నగేష్ శర్మ. స్వర్ణ శ్రీనివాసరావు. స్వర్ణ సుబ్బారావు. కలిగట్ల కృష్ణ ప్రసాద్( మారెళ్ళ) స్వర్ణ రమేష్. కొండూరు శ్రీరామ జనార్దన్ శర్మ పూజా కార్యక్రమాల్లో పాల్గొని పూజలు చేశారు. ఆలయాలకు లైన్ మాన్ పుష్పగిరి ఆంజనేయులు. ఆంజనేయ డైరీ ఎండి ఎనుముల శ్రీనివాసరెడ్డి. పుచ్చ రవీందర్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి. మణికంఠ. లైన్మెన్ కోటేశ్వరరావు. కంప్యూటర్ ఆపరేటర్ మణికంఠ. ఎనుముల నరసా రెడ్డిలు సహాయ సహకారాలు అందించారు.



