అభిప్రాయభేదాలు వీడి టీడీపీఅభ్యున్నతికి ఐకమత్యంగా ముందుకుసాగుదాం- టిడిపి కార్యాలయం ప్రారంభోత్సవంలో మం డల టీడీపీ అధ్యక్షులు ఓబుల్ రెడ్డి

తాళ్లూరు మండలంలోని టీడీపీ నేతలు కార్యకర్తలు అభిప్రాయ భేదాలు వీడి అందరం కలిసి కట్టుగా ఐకమత్యంగా ముందుకు సాగి టీడీపీ పార్టీ అభ్యున్నతికి కృషి చేద్దామని మండల టీడీపీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి అన్నారు. తాళ్లూరులోని మండల కాంప్లెక్స్ ఎదురుగా మండల టీడీపీ పార్టీ కార్యాల యాన్ని జిల్లాటీడీపీ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ కాశీంసైదా శనివారం ప్రారం భించారు. ఈ సందర్భంగా ఓబుల్రెడ్డి మాట్లాడుతూ ఏడాది కాలంలో ఎన్నికలు జరిగే సమయం వచ్చిందని, అందరూ ఐకమత్యంగా ముందుకు వెళ్లాల్సి వుంద న్నారు.
పార్టీ కార్యకర్తలు పరస్పర విమర్శలు చేసుకోవటం మంచి విధానం కాదన్నారు. ఎవరైనా పొరపాట్లు చేస్తే పార్టీ కార్యాలయంలో పెద్దల వద్ద
కూర్చుని చర్చించుకుని సర్దుబాటు చేసుకుని సర్దుకపోవాలన్నారు. పార్టీకి నష్టం కల్గించేలా ఎవరూ వ్యవహరించ వద్దని, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త పని చేసి రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయ బావుటా ఎగరవేసి చంద్రబాబును సీఎం చేయా లని తెలిపారు. ముందుగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాలులు అర్పించారు.
టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి మానంరమేష్బాబు, టీడీపీ మైనారిటీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ కాశీం సైదా, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి జి.వేణుబాబు, దర్శి నియోజకవర్గ టీడీపీ మైనారిటీ సెల్అధ్యక్షులు షేక్ మీరామొహిద్దీన్, టీడీపీ సీనియర్ నేతలు పిన్నిక రమేష్, కె.రామయ్య, ఐ.శ్రీనివాసరెడ్డి, కైపు రామకోటిరెడ్డి, సానె సురేష్ తూము శివనాగిరెడ్డి, సూరిబాబు, సిహెచ్ గుర్వారెడ్డి, రాచకొండ వెంకట్రా వు,షేక్అన్వర్, నుసుం కృష్ణారెడ్డి, ఆదినారాయణరెడ్డి, గాడిపర్తిలక్ష్మినారాయణ,తిరుప తిస్వామి, ఎఫ్రయిమ్, డాని, పాలెపోగుస్వామిదాసు,ఆవులఆదినారాయణ,నాదెండ్ల శ్రీ ను, హనుమయ్య, నాగయ్య, హుస్సేన్ కైపు నాగార్జునరెడ్డి, శ్యాంసన్, దాసు, పార్టీశ్రేణులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *