మహాశివరాత్రిసందర్భంగా శనివారం మండలంలోని పలు శివాలయాలు భక్తులతో కళ కళ లాడాయి. శివునికి ఎంతో ప్రీతి యైన శివరాత్రి రోజున పలు దేవాలయాలలో శివనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శివరామపురం, బొద్దికూరపాడు, లక్కవరం తాళ్లూరు, మాధవరం గ్రామాలలోని ఆగస్తేశ్వరరాలయం, సోమేశ్వరాలయం, మల్లేశ్వరస్వామి ఆలయాలలో
మహాశివరాత్రిని వైభవంగా జరిగాయి. క్రిష్ణస్వామి ఆలయంలో శనివారం వేకువజామున రుద్రాభిషేకం జరిగినది. శివాలయాలు మహాశివరాత్రి సందర్భంగా
భక్తుల కొరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. ఆలయాలలో స్వామివారికి అభిషేకాలు, కుంకుమపూజలతో ప్రత్యేకపూజలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

