- చిన్నగంజాం తిరునాళ్ళకు వెళ్ళి
వస్తుండగా రోడ్డు ప్రమాదం - ఐదుగురు గురు మృతి !
బాపట్ల జిల్లా.. కొరిస పాడు మండలం.. మేదరమెట్ల జాతీయ రహదారిపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అద్దంకి ఎస్సై షేక్. సుమందర్ వలి కుటుంబ సభ్యులు ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న మేదరమెట్ల ఎస్సై శివ కుమార్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని అద్దంకి సీఐ రోశయ్య ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… మృతి చెందిన వారు ప్రస్తుతం అద్దంకి పట్టణ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సుమందర్ వలి సతీమణి షేక్. వహీదా వలి (38),కుమార్తె షేక్. అయేష్ణ ఉమర్ వలి (9),మరియు బంధువులు గుర్రాల జయశ్రీ (50),గుర్రాల దివ్యతేజ (29) కోవెలమూడి వీర బ్రహ్మ చారి (22) లుగా గుర్తించారు. శనివారం చిన్నగంజాం తిరునాళ్లకు వెళ్ళి దైవదర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా మేదరమెట్ల జాతీయ రహదారిపై టైరు బరస్ట్ కావడంతో కారు అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్సై శివ కుమార్ తెలిపారు. అనంతరం మృతులను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

