పొదిలి శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన జిల్లాపరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ

నిర్మమహేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ యక్కలి శేషగిరిరావు, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామి వారి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్పర్సన్
వెంకాయమ్మను స్థానిక వైసీపీ నాయకులు, ఆలయ నూతన కమిటీ సభ్యులు శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ యక్కలి శేషగిరిరావు, సభ్యులు పులుకూరి నాగేశ్వరరావు, వైసీపీ నాయకులు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, మండల కన్వీనర్ హనీమూన్ శ్రీనివాసరెడ్డి, పట్టణ కన్వీనర్ షేక్ నూర్జహాన్ బేగం, మాజీ ఎఎంసి ఛైర్మన్ గుజ్జుల రమణారెడ్డి, ఉద్యోగ సంఘం నాయకులు గూడూరి వినోద్, ఇతర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *