జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని అమ్మవారికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు..పూజారులు విజయలక్ష్మి, ప్రకాశరావు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అమ్మవారికి భక్తులు నాలుగు చీరలు బహుకరించారు. ఆలయానికి రూ. 6,412 ఆదాయం వచ్చినట్లు ఆర్ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే వై వెంకటేశ్వర రెడ్డి, ఎస్సై నరసింహారావు తదితరులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సౌకర్యాలను ఆలయ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు, ఈఓ భాస్కర్ రెడ్డి, ఆలయ అధికారి
శ్రీనివాసరావు పర్యవేక్షించారు.


