ముండ్లమూరు మండలంలోని ఉమా మహేశ్వర పురం గ్రామంలో అమర వెంకటేశ్వర్లు (చిన్నన్న) ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు . ఆదివారం ఉదయం చుట్టుప్రక్కల గృహాల వారు చోరీ జరిగినదని గమనించి హైదరాబాదులో కొడుకు వద్ద ఉంటున్న అమరా వెంకటేశ్వర్లు కు సమాచారం అందించారు . దీంతో ఉదయాన్నే బయలుదేరి ఇంటికి చేరుకొని ఇంటిలో చూసుకునేసరికి చోరీ జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు . ఇంటి వెనకాల నుండి తలుపు కోసి ఇంటిలోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు, ఈ చోరీలో 15 లక్షల విలువ చేసే 25 కిలోలు వెండి 4 లక్షల విలువచేసే పది సవర్లబంగారం 30 వేల నగదు ను అపహరించు కుపోయినట్లు అమరా వెంకటేశ్వర్లు (చిన్నన్న ) తెలిపారు,

