మినుము పంట సస్యరక్షణలో రైతులు తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని దర్శి కృషి విజ్ఞాన కేంద్రం కీటక విభాగపు శాస్త్రవేత్త ఎం. జాహ్నవి, వాతావరణ విభాగపు శాస్త్రవేత్త కాశి విశ్వనాథ్ లు కోరారు. దర్శి మండలం శామంతపూడిలో సాగు చేసిన మినుము పొలాలను సోమవారం సందర్శించారు. మినుములో ప్రస్తుతం బూడిత తెలుగు ఆశించి ఉన్నట్లు గమనించినట్లు చెప్పారు. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ముదురు ఆకులు బూడిద రంగు రూపంలో చిన్న చిన్న మచ్చలు ఉంటాయని చప్పారు. బూడిద రంగు తెగులు నివారణకు హెక్సా కోనజోల్ 5శాత ఈ. సీ 2 మి.లీ లేదా ప్రొపికొన జోల్ 25శాతం ఈసీ 1 మి.లీ లేదా డైఫెన్ కోనజోల్ 25 శాతం 1 మి.లీ కలిపి పది పదిహేను రోజుల వ్యవధిలోరెండు సార్లు పిచికారి చెయ్యాలని సూచించారు. ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడులు సాధించి లాభాల బాటలో సాగు తారని రైతులకు వివరించారు.

