విద్యార్ధులు చిన నాటి నుండి హక్కుల పట్ల, చట్టాల పట్ల అవగాహన కలిగి బాధ్యతగా మెలిగి ఉన్నత స్థాయికి చేరాలని సీనియర్ సివిల్ జడ్జి, లోక్ అదాలత్ చైర్మన్ జి. ఎల్. వి ప్రసాద్ కోరారు. దర్శిలో ఎస్సీ కాలేజి బాయిస్ హాస్టల్లో సోమవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి, లోక్ అదాలత్ చైర్మన్ జి. ఎల్. వి. ప్రసాద్ మాట్లాడుతూ మన రాజ్యాంగం అన్ని చట్టాలకు తల్లి (మదర్ ఆఫ్ లాస్) లాంటిందని చెప్పారు. గవర్నమెంటు ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ఒక చట్టం ఉండేది. 1865 ఇండియన్ పీనల్ కోర్ట్ చట్టం గురించి వివరించారు.
రాజ్యంగం యొక్క ముఖ్య ఉద్దేశ్యం సమానత్వం, వర్గ రహిత సర్గం అన్నారు. సామాజిక న్యాయం చదువులోనే సాధ్యం, ప్రభుత్వాలు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నది కూడ సమానత్వం సాధన కోసమే అని అన్నారు. పాఠశాలలో సమానత్వం కోసం యూనిఫామ్స్ అమలు చేస్తారని అన్నారు. ప్రభుత్వాలు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నాయని. ఉపయోగించుకుని ప్రయోజకులు అయి సమాజానికి ఉపయోగపడాలని కోరారు. గొప్ప వాళ్లు అందరూ ఇలా చదివి గా డాక్టర్ ఉన్నత స్థాయికి వచ్చిన వారే అని చెప్పారు. సెల్ప్ మేడ్ పర్సన్స్ అబ్దుల్ కలాం తయారు అయ్యారని…. అలాంటి వారిని స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఉదహరించారు. వసతి గృహంలో భోజనశాలను క్షుణ్ణంగా పరిశీలించారు . వసతి గృహంలోని నీటి సమస్య ను విద్యార్థులు న్యాయమూర్తికి తెలిపారు . న్యాయ వాదులు ఎన్. వి. సుబ్బారెడ్డి, సంఘ సేవకుడు జీవి రత్నం. హాస్టల్ సంక్షేమ అధికారి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


