పారిశుధ్యం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి జి. వి. నారాయణ రెడ్డి అన్నారు.
దొనకొండ మండలం, దొనకొండ గ్రామ పంచాయతీ నందు నిర్వహించిన ప్రత్యేక పారిశుధ్య, డ్రైడే కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో పర్యటించి, గ్రామస్థులకు పారిశుధ్యం గురించి అవగాహన కల్పించారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని, గృహాలలో, పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చేస్తే దోమల వ్యాప్తి నివరించవచ్చని, కాలనుగున వ్యాధులు నిర్మూలనకు ప్రత్యేక పారిశుధ్య, డ్రైడే కార్యక్రమాలు, ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. గ్రామ పర్యటన లో దీర్ఘ కాలంగా మూసివేసి ఉన్న ఇళ్ళ దగ్గర గుర్తించిన నిల్వ ఉన్న నీటి తొట్టి లను శుభ్రపరచుట పరిశీలించారు . అలాగే పాడుబడ్డ గృహాలు, బావులు వంటి మొదలగు ప్రదేశాలలో కూడా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. తదుపరి పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ కూడా పరిశీలించారు, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పూర్తి స్థాయిలో వాడుకలోకి తీసుకురావాలని, రోడ్ల వెంట, వీధులలో చెత్త కుప్పలు ఎప్పటికప్పుడు తొలిగించాలని, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు.
