జాబు కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించాలని ఉపాధి దర్శి క్లస్టర్ ఏపీ డి పద్మశ్రీ పేర్కొన్నారు, స్థానిక ఉపాధి కార్యాలయంలో గురువారం సిబ్బందితో సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో ప్రతిరోజు మూడు వేల మందితో పనులు చేయించేలా ప్రతిపాదన చేయడం జరిగిందని ప్రతిరోజు 2000 మంది మాత్రమే పనులు చేస్తున్నారని సిబ్బంది ఆమెకు తెలియజేశారు, వచ్చే వారం కల్లా మూడు వేల మందితో పనులు చేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు, ప్రభుత్వం నూతనంగా ఎన్ ఎం ఎం ఎస్ యాప్ లో రోజుకి రెండుసార్లు కూలీల ఫోటోలను యాప్ లో నమోదు చేయాలన్నారు, రోజులు నాలుగు గంటలు పనులు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు, ఉపాధి పనికి వచ్చే ప్రతి ఒక్కరి ఫోటో యాప్ లో నమోదు చేయాలన్నారు, కూలీల మస్టర్ నమోదులో అవకతవకలకుపాల్పడితే అట్టి వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్ విధుల నుండి తీసివేయడం జరుగుతుందన్నారు, అనంతరం పసుపు గ ల్లు. సింగనపాలెం. గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనులను ఆమె పరిశీలించారు, ఈ కార్యక్రమం లో ఏపీవో కే కొండయ్య. ప్లాంటేషన్ సూపర్వైజర్. శైలేష్ ఆంద్రియ. టెక్నికల్ అసిస్టెంట్లు సుధాకర్ .అశోక్. రూతమ్మ తదితరులు పాల్గొన్నారు.
