ముండ్లమూరు( మండలంలోని మారెళ్ళ గ్రామంలో జి కోటి రాఘవమ్మ స్పృహ కోల్పోయి పల్సర్ రేట్ పడిపోవడంతో హార్ట్ బీట్ లేకపోవడం వలన కుప్పకూలిపోయింది, వెంటనే స్పందించిన ఆమె బంధువులు గ్రామములో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురాగా స్పందించిన వైద్యాధికారి బి మధు శంకర్ వెంటనే( సి పి ఆర్) (కార్డియో ఫలమనరీ రిససీ టేషన్) ఆమెకు గుండె మసాజ్ చేసి నాడీ కొట్టుకోవడం వరకు ప్రారంభించగా కాసేపటి తర్వాత పేషెంట్ బాగా మాట్లాడుతూ ప్రాణాప్రాయం నుండి బయటపడి మాట్లాడడం ప్రారంభించి లేచి తిరుగుతూ ఉండడం అందర్నీ సంతోషపరిచింది. ఈ సందర్భంగా వైద్యాధికారి మధు శంకర్ మాట్లాడుతూ ఎండలో ఉండడం వలన ఆ సమయంలో గాలి లేకపోవడం వలన చమట లు పట్టి ఇలా జరుగుతుందని ఆయన అన్నారు, వెంటనే డాక్టర్ వైద్య సేవలు అందించడం వలన ఆమె బ్రతికి బయటపడిందని గ్రామస్తులు బంధువులు డాక్టర్ను అభినందించారు,
మహిళ ప్రాణం కాపాడిన వైద్యాధికారి
24
Feb