వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యాం ప్రసాద్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి

తూర్పు రాయలసీమ ఉమ్మడి ప్రకాశం జిల్లాల పట్టభద్రుల స్థానానికి వైఎస్ఆర్సిపి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డికి మద్దతు ఇచ్చి మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ మండల జగనన్న సచివాలయ కన్వీనర్ మేడికొండ జయంతి, దర్శి నియోజకవర్గ సర్పంచ్ ల సంఘం సమన్వయకర్త ఓ గులూరి రామంజి అన్నారు. దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ఆదేశాల మేరకు ఆదివారం పలు గ్రామాలైన పూరి మెట్ల, భీమవరం , బొప్పుడు వారి పాలెం, ఈ దర, నాయుడుపాలెం, తమలూరు, ఉమామహేశ్వరపురం, సుంకర వారి పాలెం, నూజిలపల్లి, తూర్పు కంభంపాడు, బట్లపల్లి, శంకరాపురం, వేముల, వేముల బండ , కమ్మవారిపాలెం, పసుపుగల్లు, పెదవులగల్లు, చింతలపూడి, గ్రామాలలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించి వారు అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఆయన అడుగుజాడల్లో నడిచే శ్యాం ప్రసాద్ రెడ్డి ని గెలిపించాలని కోరారు. గ్రామాల్లో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు టీములుగా ఏర్పడి గ్రాడ్యుయేట్లను కలుస్తూ మద్దతు అభ్యర్థిస్తున్నారు. తొలి ప్రాధాన్యత ఓటును శ్యాం ప్రసాద్ రెడ్డికి వేయాలని కోరుతూ నమూనా బ్యాలెట్లను పంపిణీ చేస్తూ పేరు పక్కన ఒకటి అంకె వేయాలని సూచిస్తున్నారు. ముందుగా మండల వైస్ ఎంపీపీ వేముల పద్మావతి జానకిరామయ్య గృహంలో పట్టభద్రులకు ఓటుపై అవగాహన కల్పించారు. నూజెల్లపల్లి గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ చొప్పరపు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఓటర్లకు నమూనా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్యాం ప్రసాద్ రెడ్డి ప్రతినిధులు ఇనమాల వెంకటాద్రి , బొమ్మిడి శ్రీనివాసరావు, ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామ సచివాలయ కన్వీనర్లు, ఓటర్లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *