తూర్పు రాయలసీమ నియోజక వర్గ ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్సార్సీపీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రజా ప్రతినిథులు, వైఎస్సార్సీపీ నాయకులు కోరారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ఆదేశాల మేరకు తాళ్లూరు మండలంలోని బెల్లంకొండ వారిపాలెం, దోసకాయలపాడు, లక్కవరం, నాగంబొట్లపాలెం, తురకపాలెం, దారం వారి పాలెం, కొర్రపాటి వారి పాలెం గ్రామాలలో ఆదివారం జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, మండల జెసీఎస్ కన్వినర్ యాడిక శ్రీనివాస రెడ్డి, సర్పంచిలు వలి, మంచాల వెంకటేశ్వర్ రెడ్డి, పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, సొసైటీ చైర్మన్ శనివారపు శ్రీనివాస రెడ్డి, మంచాల వలసా రెడ్డి మాజీ సర్పంచి టీవీ సుబ్బా రెడ్డి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ రమణారెడ్డి, సచివాలయ కన్వినర్ కోట వెంకటేశ్వర రెడ్డి, కైలాష్ రెడ్డి, జయరాం రెడ్డి , యల్లమందరావు విష్ణు తదితరులు ప్రచారం నిర్వహించి ఓట్లను అభ్యర్థించారు.






