విద్యార్థులు విద్య తోనే భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని క్విస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపల్ డాక్టర్ దక్షిణామూర్తి అన్నారు. మండలంలోని పోలవరం క్రాస్ రోడ్డు వద్ద గల వేదా ఫార్మసీ కళాశాల నందు సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ ఏ ఎం ఎస్ ఎస్ సుధాకర్ బాబు అధ్యక్షతన జాతీయ ఫార్మసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణామూర్తి మాట్లాడుతూ ..ప్రతి విద్యార్థి విద్యను సమాజానికి మంచిగా నడుచుకొని సమాజం యొక్క ఆరోగ్య పరిరక్షణకు భాగస్వాములై ఎంతో ఉపయోగపడాలని కోరారు. ప్రతి విద్యార్థి రోజుకి ఒక నూతన మెడిసిన్ గురించి తెలుసుకొని తోటి విద్యార్థులకు తెలియపరచడం విజ్ఞానవంతుడు లక్ష్యం అన్నారు. ఫార్మసి విద్యా పితామహులైన ప్రొఫెసర్ మహదేవ్ లాల్ స్కార్వో జన్మదినోత్సవం గుర్తుగా ప్రతి సంవత్సరం మార్చి 6న జరుపుకోవడం జరుగుతుంది అన్నారు. అనంతరం దక్షిణామూర్తిని పూలమాలలతో దుశ్యాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యే విద్యార్థికి భవిష్యత్ కి పునాది -క్విస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపల్ డాక్టర్ దక్షిణామూర్తి
06
Mar